Heroine డింపుల్ ను డీసీపీ వేధించాడు.. అసలు జరిగింది ఇది: లాయర్
డింపుల్ పై ఉద్దేశపూర్వకంగానే తప్పుడు కేసు బనాయించారు. ఆమెతో డీసీపీ చాలాసార్లు ర్యాష్ గా మాట్లాడారు. హీరోయిన్ కారు పార్కింగ్ ప్రదేశంలో ట్రాఫిక్ కోన్స్ పెట్టారు. రోడ్డు మీద ఉండే సిమెంట్ బ్రిక్స్ అపార్ట్ మెంట్ లోకి ఎలా వచ్చాయి?
హీరోయిన్ డింపుల్ హయాతి (Dimple Hayati), ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే (Rahul Hegde) వివాదంపై హైడ్రామా కొనసాగుతోంది. ఒక్క రోజులోనే కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. హీరోయిన్ పై కేసు (Case Booked)నమోదు కావడం సంచలనం రేపగా.. ఈ కేసులపై హీరోయిన్ తరఫు న్యాయవాది న్యాయ పోరాటానికి దిగారు. ఈ సందర్భంగా అసలు వివాదానికి కారణమేమిటో న్యాయవాది (Lawyer) వివరణ ఇచ్చుకున్నారు. డింపుల్ ను అధికారి వేధింపులకు పాల్పడుతున్నాడని.. అందుకే కోపంలో కారును తన్నిందని చెప్పారు.
అసలు వివాదంపై హీరోయిన్ డింపుల్ హయాతి న్యాయవాది పాల్ సత్యనారాయణ (Pal Satyanarayana) వివరణ ఇచ్చారు. ‘డింపుల్ పై ఉద్దేశపూర్వకంగానే తప్పుడు కేసు బనాయించారు. ఆమెతో డీసీపీ (DCP) చాలాసార్లు ర్యాష్ గా మాట్లాడారు. హీరోయిన్ కారు పార్కింగ్ ప్రదేశంలో ట్రాఫిక్ కోన్స్ (Cones) పెట్టారు. రోడ్డు మీద ఉండే సిమెంట్ బ్రిక్స్ (Cement Bricks) అపార్ట్ మెంట్ లోకి ఎలా వచ్చాయి? ఇదే విషయాన్ని మేము రెండు నెలలుగా అడుగుతున్నాం. ఎన్నోసార్లు చెప్పినా వినకపోవడంతో అసహనంతో వాటిని హీరోయిన్ తన్నారు. అతడిపై కేసు పెడతాను అని బెదిరించడంతో ఉల్టా డీసీపీనే హీరోయిన్ పై కేసు బనాయించారు. ఆమెను వేధించాలని డీసీపీ భావిస్తున్నాడు. క్వార్టర్స్ (Quarters)లో ఉండకుండా డీసీపీ ఇక్కడ ఎందుకు ఉన్నారు? ఈ విషయంలో మేం న్యాయ పోరాటం (Legal Fight) చేస్తాం’ అని తెలిపారు.
‘ఒక డీసీపీ స్థాయి అధికారికి ఓ అమ్మాయితో (Women) ఎలా ప్రవర్తించాలో తెలియదా? అమ్మాయి మీదకి వెళ్లి మాట్లాడతారా?. ఒక సెలబ్రిటీగా.. పోలీస్ అధికారిపై కేసు పెట్టేందుకు డింపుల్ వెనుకాడింది. కానీ ఆ అధికారి తన డ్రైవర్ (Driver)తో డింపుల్ పై కేసు నమోదు చేయించారు. ప్రతిగా డింపుల్ కూడా ఫిర్యాదు చేయగా.. కేసు స్వీకరించలేదు. 4 గంటల పాటు హీరోయిన్ ను పోలీస్ స్టేషన్ లో కూర్చోపెట్టారు’ అని న్యాయవాది పాల్ సత్యనారాయణ పూసగుచ్చినట్టు వివరించారు.