KNR: తిమ్మాపూర్ మండలం నల్లగొండ శ్రీ సీతారామ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు ముగియడంతో ఆలయ హుండీల లెక్కింపు నిర్వహించారు. ఈఓ నాగుల అనిల్ కుమార్, ఆలయ కమిటీ ఛైర్మన్ బండారిపల్లి లక్ష్మణ్ సమక్షంలో హుండీలు తెరిచి లెక్కించగా రూ.17,66,347 నగదుతో పాటు బంగారం, వెండి లభించినట్లు తెలిపారు. గత ఏడాదికంటే ఈసారి ఆదాయం ఎక్కువగా వచ్చిందన్నారు.