హోలీ పండుగలో కృత్రిమ రంగులు వాడటం ఆరోగ్యానికి ప్రమాదకరం. వీటిలో ఉండే సీసం, మెర్క్యురీ, క్రోమియం వంటి రసాయనాలు చర్మంపై దద్దుర్లు, దురద, ఎలర్జీలకు దారితీస్తాయి. ఈ రంగులు కళ్లలో పడితే చూపు మందగించే ప్రమాదం ఉంది. అంతేకాదు శ్వాస ద్వారా ఊపిరితిత్తుల్లోకి చేరి ఆస్తమా వంటి సమస్యలను కలిగిస్తాయి. పర్యావరణానికి మేలు చేసే సహజ సిద్ధమైన రంగులనే వాడటం మంచిదని నిపుణులు చెబుతున్నారు.