విశాఖలో ఓ వివాహిత మంగళవారం అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకున్నట్లు గోపాలపట్నం ఎస్సై తెలిపారు. బంటుబిల్లి ఇందుమతి భర్త మహేశ్వరరావు, ఇద్దరు పిల్లలతో కలిసి సింహాచలంలో నివాసం ఉంటున్నారు. రాత్రి ఇంటిలోనే ఇందుమతి ఉరివేసుకున్నారు. సమాచారం అందుకున్న గోపాలపట్నం పోలీసులు బుధవారం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.