1965 మోంటే కార్లో ర్యాలీ విజేతకు నివాళిగా ‘మినీ కూపర్ 1965 విక్టరీ ఎడిషన్’ను భారత్‌లో లాంచ్ చేశారు. దీని బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఎక్స్‌క్లూజివ్ చిలీ రెడ్ పెయింట్, బోనెట్‌పై వైట్ స్ట్రైప్స్, 18-అంగుళాల అల్లాయ్ వీల్స్‌తో ఈ స్పెషల్ ఎడిషన్ ఆకర్షణీయంగా ఉంది. ఈ కారు వింటేజ్ లుక్‌తో పాటు పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ను అందిస్తుంది.