చర్మ సౌందర్యం మెరుగుపడాలంటే మృతకణాల తొలగింపు ముఖ్యం. ఇందుకోసం స్నానానికి ముందు ఎసెన్షియల్ ఆయిల్‌తో మసాజ్ చేయాలి. ఎండ ప్రభావం నుంచి చర్మాన్ని కాపాడుకోవడానికి బయటకు వెళ్లే 20 నిమిషాల ముందే సన్‌స్క్రీన్ రాసుకోవాలి. ఇంటికి వచ్చాక చల్లటి నీటితో స్నానం చేసి, చర్మతత్వానికి తగిన మాయిశ్చరైజర్‌ను వాడితే చర్మాన్ని తేమగా, ఆరోగ్యంగా ఉంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.