AP: పల్నాడు జిల్లా వినుకొండ సచివాలయాన్ని చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు తనిఖీ చేశారు. ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలతో సామాన్యులను పీడించిందని విమర్శించారు. SC, STలకు 6 లక్షల సోలార్ కనెక్షన్లు ఉచితంగా ఇస్తామని, ‘జలధార’ ద్వారా ప్రతి గ్రామంలో నీటి ఎద్దడిని తీరుస్తామని ఆయన హామీ ఇచ్చారు.