AP: అన్నింటికీ తెగించే తాను రాజకీయాల్లోకి వచ్చానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. శత్రువు బలంగా ఉన్నప్పుడే కొడతానని, బలహీనులను కొట్టనని చెప్పారు. కులాలను రెచ్చగొట్టడం మంచిదికాదని హితవు పలికారు. తనను వ్యక్తిగతంగా విమర్శిస్తే అంతే స్థాయిలో బదులిస్తానని హెచ్చరించారు. ‘భరిస్తాం.. సహిస్తాం.. అవసరమైతే తాటతీస్తాం’ అని జనసేనను విమర్శించే వారికి పవన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.