పశ్చిమాసియా యుద్ధం వల్ల అంతర్జాతీయంగా ఇంధన సంక్షోభం నెలకొంది. ఖతార్ ఉత్పత్తి నిలిపివేత, ఇరాన్ దాడుల ప్రభావంతో యూరప్‌లో గ్యాస్ ధరలు 50 శాతం పెరిగాయి. హార్ముజ్ జలసంధి గుండా రవాణా ఆగిపోవడంతో LNG సరఫరా దెబ్బతిని, ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇది ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ ఛార్జీలు, తయారీ రంగంపై తీవ్ర ఆర్థిక భారాన్ని మోపుతోంది.