AP: రంజాన్ పండగ సందర్భంగా ప్రభుత్వం ఇమామ్, మౌజన్ల 6 నెలల గౌరవ వేతనం బకాయిలను రూ.45 కోట్లు విడుదల చేసింది. నిన్న ఇఫ్తార్ విందులో CM చంద్రబాబు పాల్గొని.. గంటల్లోనే నిధుల విడుదలకు ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా 10 వేలమంది ఇమామ్లు, మౌజన్ల ఖాతాల్లోకి నేరుగా నగదు జమ చేయనున్నారు. 5 వేల మంది ఇమామ్లకు రూ.30 కోట్లు, 5 వేల మంది మౌజన్లకు రూ.15 కోట్లు జమచేసింది.