TG: రైతు సంక్షేమమే లక్ష్యంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు CM రేవంత్ తెలిపారు. దేశంలోని వివిధ చట్టాలను అధ్యయనం చేసి ఒక పకడ్బందీ వ్యవస్థను తీసుకొస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుతం రైతుల అవసరాలను ఆసరాగా చేసుకుని దళారులు దోపిడీ చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. రైతుల హక్కులను కాపాడేందుకు, వారికి భరోసా ఇచ్చేందుకే కనీస మద్దతు ధర(MSP) చట్టాన్ని తీసుకువచ్చామని సీఎం పేర్కొన్నారు.