TG: ఫార్మా వ్యర్థాల దహనంపై ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలేపల్లి SEZ కంపెనీలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. సుప్రీం కంపెనీపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ‘అధికారుల తనిఖీలపై కంపెనీలకు ముందే లీక్ వెళ్తోంది. తనిఖీల ముందు ఫ్యాక్టరీలు క్లీన్ చేస్తున్నాయి. NGTలో ఫిర్యాదు చేస్తా. ప్రజల ఆరోగ్యంతో ఆడుకోవద్దు. ఎంత పెద్ద కంపెనీలనైనా వదలను’ అని హెచ్చరించారు.