TG: బీజేపీ నేత లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలను CM రేవంత్ తప్పుబట్టారు. లక్ష్మణ్‌కు కనీస అవగాహన లేదని, ఆయన ఎలా డాక్టర్ అయ్యారో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. సీట్లు 50% పెంచితే ఉత్తరాదికి, దక్షిణాదికి మధ్య 410 సీట్ల గ్యాప్ వస్తుందని వివరించారు. ఈ పెంపుతో TGని తెలివిగా మోసం చేసే కుట్ర జరుగుతోందని, పెంపు తర్వాత కూడా నియోజకవర్గాల మధ్య వ్యత్యాసం సమానంగా ఉండాలని డిమాండ్ చేశారు.