AP: సీఎస్ విజయానంద్పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గ్రూప్-1 మెయిన్స్ మూల్యాంకనం కేసులో హైకోర్టులో విచారణ జరిగింది. గ్రూప్-1 పరీక్షలో ఎంపికైనవారిని సిట్ విచారణ పూర్తయ్యేవరకు అప్రాధాన్య పోస్టులకు బదిలీ చేయాలని గతంలో హైకోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాలు అమలు చేయకపోవడంపై హైకోర్టు సీరియస్ అయ్యింది. ఈనెల 11న ఆదేశాలిస్తే ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించింది.