AP: రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ఇవాల అనంతపురంలో పర్యటించనున్నారు. JNTUలో జరిగే 15వ స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొని.. తన ప్రసంగంతో విద్యార్థులకు కీలక సందేశం ఇవ్వనున్నారు. అనంతరం ప్రతిభ చాటినవారికి గోల్డ్ మెడల్స్ ప్రదానం చేస్తారు. గవర్నర్ పర్యటన నేపథ్యంలో అనంతపురం జిల్లా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.