AP: ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి కొడాలి నాని విమర్శించారు. కూటమి నేతలు సూపర్-6ను సూపర్ సున్నా చేశారని ఎద్దేవా చేశారు. మహాలక్ష్మి, నిరుద్యోగ భృతి పథకాలు ఏమయ్యాయో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. కూటమి దొడ్డిదారిన గెలవడానికే SIR ప్రక్రియ అని, YCP నాయకత్వం అప్రమత్తంగా ఉండాలని గుడివాడలో నిర్వహించిన SIR అవగాహన సదస్సులో సూచించారు.