తమ డేటా సెంటర్లపై ఇరాన్ డ్రోన్లతో దాడి చేసిన మాట వాస్తవమేనని అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) ధ్రువీకరించింది. UAEలోని రెండు సెంటర్లపై నేరుగా, బహ్రెయిన్‌లోని మరో సెంటర్ సమీపంలో ఈ దాడులు జరిగాయి. దీనివల్ల భారీగా మంటలు చెలరేగి భవనాలు దెబ్బతినడమే కాకుండా, విద్యుత్ సరఫరా నిలిచిపోయి సర్వీసులకు అంతరాయం కలిగింది. టెక్ ప్రపంచంలో ఈ దాడి ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది.