AP: ప్రపంచంలోనే సురక్షితమైన ప్రాంతంగా భారత్ నిలిచిందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. భారత సుస్థిర వృద్ధిని ప్రపంచ దేశాలు ఆసక్తిగా చూస్తున్నాయని అన్నారు. ప్రతి 45 రోజులకు ఒక విమానాశ్రయం ప్రారంభిస్తున్నామని చెప్పారు. ఉడాన్ ద్వారా విమాన ప్రయాణం సామాన్యుడికి చేరువైందని పేర్కొన్నారు. రష్యా సాంకేతిక పరిజ్ఙానంతో 100 సీట్ల విమానాలను నిర్మిస్తున్నామని వెల్లడించారు.