AP: తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈనెల 2న తనపై రెండుసార్లు హత్యాయత్నం జరిగిందని తెలిపారు. ‘నాపై దాడి చేస్తారని నా గన్మెన్కి 15సార్లు ఇంటెలిజెన్స్ ఫోన్ చేసింది. నన్ను భూమ్మీద లేకుండా చేయాలనుకున్నారు. నన్ను అంతం చేయాలనే లక్ష్యంతో కొందరు ప్రయత్నించారు. నెమలి గ్రామంలో కరెంట్ కట్చేసి దాడి చేయాలనుకున్నారు’ అని వెల్లడించారు.