AP: కూటమి ప్రభుత్వం చేస్తున్న ఆలయాల అభివృద్ధిపై YCP నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మండిపడ్డారు. ఇలాంటి పనులు చేయడం వల్లే దేవుడు వారిపై ఆగ్రహించారని.. అందుకే 11 సీట్లు ఇచ్చి ఇంట్లో కూర్చొపెట్టారని ఆరోపించారు. బనగానపల్లె మండలంలోని యాగంటి ఉమామహేశ్వర స్వామి ఆలయాన్ని ఆయన దర్శించుకొని పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.