AP: వేట్లపాలెం ఘటన చాలా దురదృష్టకరమని సీఎం చంద్రబాబు అన్నారు. ‘ఘటన జరిగిన ప్రాంతం హృదయ విదారకంగా ఉంది. ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం. ఈ ఘటనపై విచారణ కమిటీ నియమిస్తాం. నలుగురు అధికారులను సస్పెండ్ చేస్తున్నాం. బాధ్యులను అరెస్ట్ చేసి.. జీవిత ఖైదు పడేలా చూస్తాం. బాధ్యుల ఆస్తులు జప్తు చేసి.. బాధితుల కుటుంబాలకు పంచుతాం’ అని హామీ ఇచ్చారు.