AP: విశాఖలో నిర్వహించిన TDP ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో MLA గంటా శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా NTR విగ్రహానికి నివాళులర్పించారు. TDP కార్యాలయంలో ఉత్తమ కార్యకర్తలను సన్మానించారు. తెలుగువారి ఆత్మగౌరవం కోసమే TDPని స్థాపించారని తెలిపారు. NTR కృషి వల్లే సంక్షేమం, మహిళలకు ఆస్తి హక్కు లభించిందని చెప్పారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రం అగ్రగామిగా ఉందన్నారు.