ఐఫోన్ 17e ని యాపిల్ సంస్థ ఆవిష్కరించింది. ఏ19 చిప్సెట్, 48 మెగాపిక్సెల్ ఫ్యూజన్ కెమెరా కలిగిన ఈ ఫోన్కు 17 సిరీస్లో తక్కువ ధరకు నిర్ణయించారు. రూ.64,900 నుంచి ఈ ఫోన్ లభించనుంది. ఈనెల 4న ముందస్తు ఆర్డర్లు ప్రారంభిస్తున్నట్లు సంస్థ తెలిపింది. 11 నుంచి డెలివరీ చేస్తామని పేర్కొంది. 15 వాట్ల వైర్లెస్ ఛార్జింగ్, USB-C వైర్ ఛార్జింగ్ సదుపాయం ఉంది.