TG: మావోయిస్టు నేత పసునూరి నరహరి, ఆయన భార్య ధనమ్మ డీజీపీ సీవీ ఆనంద్ ఎదుట లొంగిపోయారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రకటించిన రివార్డు మొత్తాలను వారికి అందజేశారు. నరహరికి రూ.25 లక్షలు, ధనమ్మకు రూ.20 లక్షల విలువైన చెక్కులను డీజీపీ చేతుల మీదుగా పంపిణీ చేశారు. వీరు సమాజంలో సాధారణ జీవనం గడపడానికి పునరావాసం కల్పిస్తామని పోలీసులు తెలిపారు.