TG: 1980 ఎకరాల్లో ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ నిర్మాణం చేయనున్నట్లు MLA పాయల్ శంకర్ తెలిపారు. ‘రాష్ట్రంలో శంషాబాద్ తర్వాత అతిపెద్ద ఎయిర్‌పోర్ట్‌గా ఆదిలాబాద్ నిలుస్తుంది. వాయుసేన ఎయిర్‌ఫీల్డ్, శిక్షణ కేంద్రంతో పాటు ఇతర రక్షణ సంస్థలు ఏర్పాటవుతాయి. ఈ నెల 10న కేంద్ర, రాష్ట్ర అధికారులు సమావేశమవుతారు. ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టును BRS నిర్లక్ష్యం చేసింది’ అని అన్నారు.