TG: జగిత్యాల జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్లను 10 రోజుల్లో పూర్తి చేయాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో 5 లక్షల మెట్రిక్ టన్నుల వరి దిగుబడి అంచనా వేయగా, ఇప్పటివరకు 3.29 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. ధాన్యం కొనుగోళ్లలో జిల్లా రాష్ట్రంలోనే 4వ స్థానంలో ఉందని తెలిపారు. రవాణాకు 862 లారీలు, 233 డీసీఎంలు, 297 ట్రాక్టర్లు వాడుతున్నట్లు కలెక్టర్ సత్యప్రసాద్ పేర్కొన్నారు.