AP: మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్రావు మృతి పట్ల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. న్యాయవాదిగా, రాజకీయవేత్తగా ఆయన పరిజ్ఞానం ఎంతో విలువైనదని అన్నారు. పితృవియోగం బాధ నుంచి మంత్రి మనోహర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మనోహర్, ఆయన కుటుంబసభ్యులకు పవన్ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.