AP: మెగా డీఎస్సీ నిర్వహణలో పారదర్శకత ఎక్కడుందని YCP అధినేత జగన్ ప్రశ్నించారు. పేపర్లు లీక్, డేటా డిలీట్, మెరిట్ లిస్టు మాయంపై కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. SCERT అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి తొలి ర్యాంకు ఎలా వచ్చిందో చెప్పాలన్నారు. DSCలో అవినీతికి బాధ్యత వహిస్తూ లోకేష్‌ను పదవి నుంచి తప్పించి, CBI దర్యాప్తు జరిపించాలని డిమాండు చేశారు.