AP: ‘మెగా DSC’లోని స్పోర్ట్స్ కోటా జాబితాలో ‘బ్రిడ్జ్’ (Bridge) క్రీడను చేర్చడంపై YCP అభ్యంతరం చెబుతోంది. ఇది పేకాట అని పేర్కొంటోంది. ఈ ఆరోపణ పూర్తిగా నిరాధారమని, కేంద్రం రూపొందించిన అధికారిక క్రీడా విభాగాల జాబితాలో ‘బ్రిడ్జ్’ ఉన్నందున, దానిని స్పోర్ట్స్ కోటాకు పరిగణనలోకి తీసుకున్నామంటున్నారు అధికారులు. ఈ క్రీడా విభాగంలో ఎవరికీ ఉద్యోగమే ఇవ్వలేదని AP ప్రభుత్వం స్పష్టం చేసింది.