దేశంలో ఒకప్పుడు అత్యంత ప్రజాదరణ పొందిన రెనాల్ట్ డస్టర్.. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో లేటెస్ట్ లుక్, టెక్ లోడెడ్ ఫీచర్లతో మళ్లీ ఎంట్రీ ఇచ్చింది. దాదాపు నాలుగేళ్ల తర్వాత సరికొత్త డిజైన్, అడ్వాన్స్డ్ ఫీచర్లతో ఈ SUVని లాంచ్ చేశారు. ఈ కారు ప్రారంభ ధర రూ.10.29 లక్షలు (ఎక్స్‌షోరూమ్)గా కంపెనీ నిర్ణయించింది. బుకింగ్ టోకెన్ అమౌంట్ రూ.21 వేలుగా కంపెనీ నిర్ధారించింది.