కొత్త కాపురంలో అడుగుపెట్టిన మహిళలు తమ సందేహాల కోసం గూగుల్‌ను ఆశ్రయిస్తున్నారు. భర్త, అత్తమామల ప్రేమను ఎలా పొందాలో సెర్చ్ చేస్తున్నారు. ఉద్యోగం, ఇంటి బాధ్యతలను ఎలా బ్యాలెన్స్ చేయాలో తెలుసుకుంటున్నారు. పిల్లల విషయంలో సరైన సమయం కోసం వెతుకుతున్నారు. నవవధువులు తమ సమస్యల పరిష్కారానికి బయట వ్యక్తుల కంటే ఆన్లైన్ చిట్కాలనే ఎక్కువగా నమ్ముతున్నట్లు సర్వేలు చెబుతున్నాయి.