AP: పలువురు నేతల పనితీరుపై సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. పనితీరు మెరుగుపడలేదని మంత్రి కొండపల్లికి సూచించారు. 6 నెలలుగా ఏ వ్యవహారంలోనూ తన తండ్రి జోక్యం చేసుకోవట్లేదని కొండపల్లి వివరించారు. అందరినీ కలుపుకొని ముందుకెళ్లాలని సీఎం తెలిపారు. అలాగే, కొందరు MLAల తీరుపైనా చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నారు. అందరితో సఖ్యతగా ముందుకెళ్లాలని లోకం మాధవికి చెప్పారు.