నేరం చేసి పోలీసులకు దొరకకుండా పరారీలో ఉన్న వ్యక్తి, దేశం విడిచి పారిపోకుండా అడ్డుకోవడమే ఈ నోటీసు ప్రధాన ఉద్దేశ్యం. దర్యాప్తు సంస్థల విన్నపం మేరకు ఇమ్మిగ్రేషన్ అధికారులు దీనిని జారీ చేస్తారు. అన్ని విమానాశ్రయాలు, ఓడరేవులు, సరిహద్దుల్లో ఈ వివరాలు ఉంటాయి. నిందితుడు ఎయిర్పోర్టులో కనిపిస్తే వెంటనే అధికారులు అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగిస్తారు.