TG: సీఎం అంటే చాలా హుందాగా వ్యవహరించాలని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. కేసీఆర్ సభ పెట్టుకున్న రోజే.. రేవంత్ రెడ్డి సభ పెట్టారని విమర్శించారు. KCR మాట్లాడటం ప్రారంభించగానే.. రేవంత్ రెడ్డి మైకు అందుకున్నారని మండిపడ్డారు. యూట్యూబ్లో కేసీఆర్ ప్రసంగాన్ని 36 లక్షల మంది చూస్తే.. రేవంత్ రెడ్డి ప్రసంగాన్ని 4 లక్షల మంది చూశారని.. ఎవరి స్థాయి ఏంటో ప్రజలకు అర్థమైందన్నారు.