ప్రధాని మోదీ అధ్యక్షతన ఇవాళ కేంద్ర క్యాబినెట్ జరగనుంది. ఈ భేటీలో జమిలి ఎన్నికల బిల్లుపై ప్రధానంగా చర్చించనున్నారు. ‘ఒకే దేశం.. ఒకే ఎన్నిక’పై ముసాయిదా బిల్లును కేంద్ర న్యాయ శాఖ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్యాబినెట్ సమావేశంలో ఈ బిల్లుపై మరోసారి చర్చించి ఆమోదం తెలుపనున్నారు. ఈ బిల్లును శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లోనే ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం.