జీవనశైలిలో చిన్న మార్పులతో డిప్రెషన్‌ను జయించవచ్చు. నిత్యం వ్యాయామం, యోగా, ధ్యానం చేయడం వల్ల మానసిక స్థితి మెరుగుపడుతుంది. కుటుంబం, స్నేహితులతో సమయం గడుపుతూ భావాలను పంచుకోవాలి. పోషకాహారం తీసుకుంటూ మద్యం, ధూమపానానికి దూరంగా ఉండాలి. ప్రతిరోజూ డైరీ రాసే అలవాటు నెగటివ్ ఆలోచనలను తగ్గిస్తుంది. కంటినిండా నిద్ర మానసిక ప్రశాంతతకు ఎంతో అవసరం.