TG: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉ.11:45 గంటలకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రసంగిస్తారు. ఈనెల 20న బడ్జెట్ను భట్టి ప్రవేశపెట్టనున్నారు. ఈసారి కొత్త హాల్లో మండలి కొలువుదీరనుంది. ఇవాళ గవర్నర్, CM చేతుల మీదుగా అసెంబ్లీ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ సమావేశాలకు KCR హాజరవుతారా? అనేది ఆసక్తికరంగా మారింది.