TG: సీఎం రేవంత్ రెడ్డి తొలి సంతకం చేసిన ఫైల్ ఏమైందని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ‘కాకి ఎత్తుకపోయిందా లేక FSL అగ్రిప్రమాదంలో కాలిపోయిందా? మాయమైపోయిన ఫైల్స్ కోసం సిట్ వేయాలి. తొలి కేబినెట్లో ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత ఏమైంది. సీఎం తొలి సంతకం చేసిన ఫైల్‌కు జీరో వాల్యూ. విశ్వసనీయత కోల్పోయిన మీ ప్రభుత్వానికి జీరో వాల్యూ’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.