AP: శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామివారి దేవాలయంలో రేపు సింహాద్రి అప్పన్న స్వామి డోలోత్సవం సంప్రదాయబద్ధంగా జరగనుంది. ఆ రోజు స్వామివారి సోదరీమణి, అడివివరం గ్రామ దేవత శ్రీపైడితల్లి అమ్మవారి కుమార్తెతో పెళ్లిచూపులు జరుగుతాయని విశ్వసిస్తారు. స్వామివారి కల్యాణోత్సవాలకు ముందు జరిగే ఈ ఉత్సవం కోసం గ్రామీణ భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు.