TG: 2014-15 నాటి రూ.1,468.94 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని కోరారు. ధాన్యం సేకరించిన 48 గంటల్లోనే రైతులకు నగదు చెల్లిస్తున్నామని, రాష్ట్రంపై ఆర్థిక భారం తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే పాఠశాలలు, హాస్టళ్లలో నిలిపివేసిన పోషకాహార బియ్యం(FRK) పంపిణీని రక్తహీనత నివారణ కోసం మళ్లీ ప్రారంభించాలని కోరారు.