TG: గాంధీభవన్‌లో జరిగిన గొడవపై కార్వాన్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఉస్మాన్ హజ్రీ స్పందించారు. ఫిరోజ్ఖాన్కు క్షమాపణ చెప్పినట్లు తెలిపారు. ఇద్దరు అన్నదమ్ముల మధ్య జరిగిన చిన్న గొడవని చెప్పారు. మరోవైపు చిన్న అభిప్రాయబేదం వల్ల గొడవ జరిగిందని ఫిరోజ్‌ఖాన్ వెల్లడించారు. ఉస్మాన్ తనకు పెద్దన్న లాంటివాడని అన్నారు. ఇది తమ ఫ్యామిలీ విషయం అని పేర్కొన్నారు.