TG: రాష్ట్రంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో అవకతవకలు జరిగినట్లు ప్రభుత్వం గుర్తించింది. ఉద్యోగాల నియామకం, వేతనాల చెల్లింపుల్లో భారీగా అవకతవకలు జరిగినట్లు తెలిపింది. 25వేల మంది బోగస్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు విధుల్లో లేకపోయినా జీతాలు పొందుతున్నట్లు తేల్చింది. అవకతవకల్లో 900 ఏజెన్సీల పాత్రతో సహా.. గత పదేళ్లలో రూ. వందల కోట్ల నిధులు దుర్వినియోగం జరిగినట్లు పేర్కొంది.