కొన్ని చిట్కాలతో జ్ఞాపకశక్తిని పెంచుకోవచ్చు. రోజుకు 7-8 గంటల గాఢ నిద్ర మెదడుకు చాలా అవసరం. బాదం, వాల్నట్స్, ఆకుకూరలు, ఓమెగా-3 ఫుడ్స్ మెదడు చురుకుదనాన్ని పెంచుతాయి. పజిల్స్ పూరించడం, చదవడం, కొత్త విషయాలు నేర్చుకోవడం అలవాటు చేసుకోవాలి. రోజూ యోగా లేదా ధ్యానం చేయడం వల్ల ఏకాగ్రత, రక్తం సరఫరా మెరుగవుతాయి. ప్రశాంతంగా ఉండటం వల్ల జ్ఞాపకశక్తి దెబ్బతినకుండా ఉంటుంది.