మోనాలిసా భర్తకు కేరళ హైకోర్టులో ఊరట లభించింది. అతణ్ని మే 20లోపు అరెస్ట్ చేయొద్దని కోర్టు తీర్పునిచ్చింది. ఈలోపు ఆమె మైనరా? కాదా? ఆ వివాహం చెల్లుబాటు అవుతుందా? అనే అంశాలపై దర్యాప్తు కొనసాగనుంది. కాగా.. పూసలమ్ముతూ ఫేమస్ అయిన మోనాలిసా.. ఫర్మాన్ ఖాన్ అనే వ్యక్తిని అనూహ్యంగా ప్రేమ పెళ్లి చేసుకోగా.. ఆమెకు 18 సంవత్సరాలు నిండలేవని.. మైనర్ అని తల్లిదండ్రులు కేసు పెట్టారు.