AP: NTR జిల్లా తిరువూరులో జరిగిన చైన్ స్నాచింగ్ కేసులో ఓ ప్రభుత్వ ఉద్యోగి అరెస్టయ్యాడు. విజయవాడలో అసిస్టెంట్ లైన్మెన్గా పనిచేస్తున్న నంద సుభాష్ అనే వ్యక్తి ఇటీవల చిక్కుళ్లగూడెంలో ఓ మహిళ మెడలో బంగారు గొలుసును అపహరించాడు. నిందితుడి నుంచి 40గ్రా. బంగారు గొలుసు, బైక్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.