AP: మాజీ సీఎం జగన్ భావోద్వేగాలు లేని వ్యక్తి అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ అన్నారు. వైసీపీ అవినీతి పునాదులపై ఏర్పడిన పార్టీ అని పేర్కొన్నారు. ప్రజలకు మంచి చేయాలనే తపన జగన్, వైసీపీలో లేదని విమర్శించారు. కూటమి మళ్లీ అధికారంలోకి వచ్చేలా మూడు పార్టీలు కలిసి పనిచేస్తాయని వెల్లడించారు. మహానాడులో 20 ముఖ్యమైన నిర్ణయాలను తీసుకుబోతున్నామని తెలిపారు.