AP: సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి కాగానే గోదావరి జలాలను కుడి, ఎడమ కాల్వల ద్వారా తరలించి.. వాటిని ఏయే అవసరాలకు, ఎంత మేర వినియోగించుకోవాలనే దానిపై ఓ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కాల్వలకు అనుసంధానంగా ఉన్న రిజర్వాయర్లు, చెరువులు నింపేలా ప్రణాళిక రూపొందించాలని సూచించారు.