AP: కడప జిల్లా ఖాజీపేటలో యువతి హత్యపై మంత్రి సవిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గొంతు కోసిన ప్రేమోన్మాదిని కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. నిందితుడి వెనుక ఎంతటి వారున్నా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. కాగా తనను పెళ్లి చేసుకోలేదని యువతిని దారుణంగా వెంకటేష్ గొంతు కోసి చంపిన విషయం తెలిసిందే.