NLR: కోవూరు నియోజకవర్గానికి చెందిన పలువురుని వైసీపీ అనుబంధ విభాగ కమిటీలలో వివిధ హోదాలలో నియమించారు. ఈ మేరకు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. రైతు విభాగ ప్రధాన కార్యదర్శి హరి ప్రసాద్ రెడ్డి పాటు మొత్తం 7 మందిని నియమించారు. పార్టీ బలోపేతం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.