TG: డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తాను బంట్రోతు ఉద్యోగం చేస్తున్నానని రేవంత్ రెడ్డి అన్నారని.. ఉమ్మడి రాష్ట్రంలో ప్రజలను కాంగ్రెస్ బంట్రోతులుగా చూసిందని విమర్శించారు. డీలిమిటేషన్‌కు వీలైతే మద్దతివ్వండి లేదా నోరు మూసుకోని కూర్చోవాలని హెచ్చరించారు. వితండవాదాలు పక్కన బెట్టి బిల్లుకు మద్దతివ్వాలన్నారు.